గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి వెళ్తూ.. పంచాయతీ సెక్రటరీ మృతి

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి వెళ్తూ.. పంచాయతీ సెక్రటరీ మృతి
  • వికారాబాద్ జిల్లాలో ఘటన

వికారాబాద్, వెలుగు: గ్రూప్-–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి పంచాయతీ సెక్రటరీ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బొంరాస్ పేట మండలం బోరబండ తండాకు చెందిన సుమిత్ర(28) పంచాయతీ సెక్రటరీ. ఆదివారం భర్త నెహ్రూనాయక్ తో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసింది.

తిరిగి  బైక్ పై వెళ్తుండగా ధారూర్ మండలం దోర్నాల వద్ద అదుపు తప్పి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన సుమిత్రను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.  భర్త నెహ్రూ నాయక్ కు స్వల్ప గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.