Durgesh Kumar: ఇబ్బందుల తరువాతే అవకాశాలు.. అడల్ట్ సినిమాలు కూడా

Durgesh Kumar: ఇబ్బందుల తరువాతే అవకాశాలు.. అడల్ట్ సినిమాలు కూడా

బాలీవుడ్ సిరీస్ పంచాయత్ వెబ్ సిరీస్ ఎంత పేద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సిరీస్ సీజన్ 3 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు గత రెండు సీజన్లకు మించి ప్రజాధారణ లభించింది ఈ సిరీస్ కు. అంతేకాదు ఈ సిరీస్ లో నటించిన నటీనటులకు కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ నటులలో దుర్గేష్ కుమార్ ఒకరు. సీజన్ 3లో ఆయనకు మంచి పాత్ర లభించింది. 

ఇక పంచాయత్ సీజన్ 3 మంచి విజయాన్ని సాధించిన నేపధ్యంలో తన ఆనందాన్ని, ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఆయన ఎదుర్కొన్న కష్టాల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నను ఇంజనీరింగ్ పూర్తి చేశాను కానీ.. నాకు నటన అంటే పిచ్చి. అందుకే.. డిగ్రీ చేస్తూనే.. నేషనల్ డ్రామా స్కూల్ లో యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. ఆ తరువాత అవకాశాల కోసం సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగాను కానీ, ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఆ సమయంలో నాకు కొంత స్నేహితులు ఏర్పడ్డారు. అందరం కలిసి తిరిగేవాళ్ళం. 

అప్పుడు అడల్ట్ సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ టైంలో డబ్బులకు బాగా ఇబ్బంది ఉండేది. అందుకే అలాంటి సినిమాల్లో నటించాల్సి వచ్చింది. ఆ తరువాత హైవే, సుల్తాన్, ఫ్రీకీ అలీ వంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. పంచాయత్ ఫస్ట్ సీజన్ లో చిన్న రోల్ చేశాను.. అది మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు పంచాయత్ సీజన్ 3లో మంచి అవకాశం రావడం.. అది కూడా విజయం సాధించడం ఆనందంగా ఉంది.. అంటూ చెప్పుకొచ్చాడు దుర్గేష్ కుమార్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.