Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త వెబ్ సిరీస్.. సివ‌ర‌ప‌ల్లి పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ కథేంటీ?

Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త వెబ్ సిరీస్.. సివ‌ర‌ప‌ల్లి పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ కథేంటీ?

హిందీలో వచ్చిన పంచాయితీ వెబ్ సిరీస్కు తెలుగు రీమేక్ "సివ‌ర‌ప‌ల్లి". జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో రాగ్ మయూర్, రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్ సన్నీ పల్లె, ఉదయ్ గుర్రాల పావని కరణం కీ రోల్స్ లో నటించారు.

కంప్లీట్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో స‌హ‌జ‌త్వానికి ప్రాధాన్య‌త‌నిస్తూ రూపొందించారు. నాచుర‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేయ‌డంతో నిజంగానే ఓ ప‌ల్లె జీవితాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

కథ:

శ్యామ్ (రాగ్ ముసూర్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివ‌ర‌ప‌ల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం వస్తుంది. తను మాత్రం తన ఫ్రెండ్స్ లాగే పారిన్ వెళ్లి సెటిల్ కావాలి అనుకుంటాడు. కానీ తండ్రి మాట కాదనలేక ఉద్యోగంలో చేరతాడు. సిపరపల్లి గ్రామానికి సుశీల (రూప లక్ష్మి) సర్పంచ్ కానీ.. సుకీల చేయాల్సినవసులన్నీ ఆమె భర్త సుధాకర్ (మురళీదర్ గౌడ్) చూసుకుంటాడు. శ్యామ్ ఊరిలోని పంచాయతీ ఆఫీసులోనే ఒక రూమ్ లో ఉంటూ పనిచేస్తుంటాడు. కానీ, ఆ ఊరి వాతావరణం, అక్కడి వాళ్ల తీరు శ్యామ్ కు నచ్చదు. దాంతో సాధ్యమైనంత త్వరగా పారిన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అక్కడివాళ్లు ప్రభుత్వ విధానాల పట్ల బాధ్యతగా లేకపోయినా తాను మాత్రం నిజాయితీగా పనిచేస్తాడు. అప్పుడు అతనికి. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? జీమ్యాట్ ఎగ్జామ్ రాసి అమెరికా వెళ్లిపోవాల‌నే శ్యామ్ క‌ల తీరిందా? అనేదే మిగతా కథ.