స్టేషన్​ఘన్​పూర్​లో రోడ్డుపై భోజనాలు చేస్తూ కార్మికుల నిరసన

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పంచాయతీ కార్మికులను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రోడ్డుపై భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల జేఏసీ చైర్మన్ రాపర్తి రాజు మాట్లాడారు. సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. నాయకులు భాస్కర్​, రావుల జగన్నాథం, కందాలోజు రాజు, కొడెపాక శ్రీనివాస్​, కుంభం రాజు, వినయ్​, బోసు రాజు, లక్ష్మి, యాదమ్మ, శోభ, స్వరూప పాల్గొన్నారు.

ALSO READ :రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా శవయాత్ర

మహాముత్తారం, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, తాడిచెర్ల మండల కేంద్రంల్లో జీపీ కార్మికులు 11వ రోజు సమ్మెలో భాగంగా భిక్షాటన చేశారు.
మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎంపీడీవో ఆఫీస్ ఎదుట జీపీ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం నాటికి 11 వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కరించి, జీతాలు పెంచి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మొగుళ్ళపల్లి చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్తూ వ్యాపారస్తులు, ప్రజల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు సత్యం,రమేశ్​, రాధమ్మ,లింగయ్య, సరిత పాల్గొన్నారు.