కేసీఆర్ పాలనలో పల్లెల అభివృద్ధి

కేసీఆర్ పాలనలో పల్లెల అభివృద్ధి

రంగారెడ్డి: కేసీఆర్ పాలనలో పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి  సబితా ఇంద్రా రెడ్డితో కలిసి మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  70 ఏళ్ల నుంచి కానిది ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించి చూపారని కొనియాడారు. కొత్త కొత్త పథకాలతో సంక్షేమానికి పెద్ద పీట వేశారని, కేంద్ర ప్రభుత్వంతో మొదలుకొని పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేశాయన్న ఆయన... కేసీఆర్‌ ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారని స్పష్టం చేశారు.  గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమ వైపే ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

అత్యాచార ఘటనలపై డీజీపీకి వినతి పత్రం

పబ్ వ్యవహారంలో నా మనవడిపై అనవసర ఆరోపణలు