కేరళలో పంచాయతీల పనితీరు భేష్: ఎంపీ ప్రియాంక గాంధీ

కేరళలో పంచాయతీల పనితీరు భేష్: ఎంపీ ప్రియాంక గాంధీ

తిరువనంతపురం: కేరళలో పంచాయతీలు పనిచేస్తున్న తీరును చూస్తే గర్వంగా ఉన్నదని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ అన్నారు. గతేడాది భారీ వర్షాలతో  కొండచరియలు విరిగిపడ్డాయని.. ఆ సమయంలో ఎంతో బాధ, ఆవేదన ఉన్నా పంచాయతీ సభ్యులు నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ప్రియంక గురువారం తన నియోజకవర్గం వయనాడ్  చేరుకున్నారు. స్మార్ట్ అంగన్‌‌వాడీ, అతిరట్టుకున్ను లిఫ్ట్ ఇరిగేషన్, ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు.