డబుల్​బెడ్ ​రూమ్​ ఇండ్ల ముట్టడి

బోధన్, వెలుగు: బోధన్ శివారులోని పాండుఫారంలో నిర్మించిన డబుల్ బెడ్​రూమ్​ ఇండ్లను సోమవారం కాంగ్రెస్​ లీడర్లు ముట్టడించారు. ఇండ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. బోధన్​ఎమ్మెల్యే షకీల్ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. 

నిర్మాణం చేపట్టిన ఇండ్లు వృథాగా ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఎంతో మంది లబ్ధిదారులు డబుల్​ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే ఇండ్ల పంపిణీ చేపట్టాలని డిమాండ్​ చేశారు.​ పట్టణ సీఐ ప్రేమ్​కుమార్​ నాయకులను అరెస్ట్​చేసి  పోలీస్ స్టేషన్​ తరలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​పట్టణ యూత్​ ప్రెసిడెంట్​తలారీ నవీన్, మైనార్టీ డిస్ట్రిక్ట్​ వైస్ ప్రెసిడెంట్ ​ ఖలీమ్, లీడర్లు సాయి, కృష్ణ, సాయిలు, హైమ్మద్ తదితరులు        పాల్గొన్నారు.