జైళ్ల శాఖ డీఎస్పీ.. ఎక్సర్ సైజులు చేస్తూ గుండెపోటుతో మృతి

హర్యానాలోని పానిపట్‌లోని సివా గ్రామంలోని జైలులో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జోగిందర్ దేస్వాల్ దురదృష్టకర పరిస్థితుల్లో మరణించారు. కర్నాల్‌లోని తన నివాసంలో ఉన్న ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారు .  ఆయన ఉదయం 5 గంటలకు జిమ్‌లో వ్యాయమం చేస్తుండగా ఈ విషాద సంఘటన జరిగింది, అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో స్పాట్ లోనే చనిపోయారు.  

ALSO READ : ODI World Cup 2023: శ్రీలంక దిగ్గజాన్ని వెనక్కి నెట్టిన కోహ్లీ.. ఇక మిగిలింది ముగ్గురే

50 ఏళ్ల  జోగిందర్ దేస్వాల్  గతంలో కర్నాల్ జైలులో డీఎస్పీగా కూడా పనిచేశాడు.  ప్రస్తుతం ఆయన తన  కుటుంబంతో సహా కర్నాల్‌లోని న్యాయపురిలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన నివాసానికి సమీపంలో ఉన్న వ్యాయామశాలకు బయలుదేరారు. అక్కడ  ఉదయం 5:30  గంటల మధ్యలో ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా  కిందపడిపోయారు.  సమీపంలో ఉన్న వారు వెంటనే అయన్ను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే  ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.