58 ఏళ్లలో తల్లి కాబోతుంది

పంజాబీ పాప్ సింగర్, కాంగ్రెస్ లీడర్ సిద్ధూ మూసేవాలా త‌ల్లి చ‌ర‌ణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో తల్లికాబోతుంది. బాల్ కౌర్ సింగ్(60), చ‌ర‌ణ్ కౌర్(58) దంప‌తుల‌కు సిద్ధూ మూసేవాలా ఒక్కడే సంతానం. 2022, మే 29న  మ‌న్సా జిల్లాలోని జ‌వ‌హ‌ర్కే గ్రామంలో సిద్దూ కారును అడ్డగించి కొందరు దుండగులు దారుణంగా హ‌త్య చేశారు.  

ALSO READ :- మీ తప్పుడు యాడ్స్ ఆపేయండి : పతంజలికి సుప్రీంకోర్టు ఆదేశం

అప్పడు సిద్ధూ మూసేవాల వయసు 28 ఏళ్లు. ఆయన ప్రముఖ పంజాబీ సినిమాల్లో పాటలు పాడారు. కాంగ్రెస్ పార్టీ తరుపున మాన్సా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే సంతానం కోసం ఐవీఎఫ్ ద్వారా ఇటీవ‌ల చ‌ర‌ణ్ కౌర్ గ‌ర్భం దాల్చిన‌ట్లు ఆమె సోద‌రుడు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉంది. మార్చిలో ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వనుంది.