సికింద్రాబాద్, వెలుగు: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న అడిషనల్ప్రొఫెసర్ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బేగంపేట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై జయచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బ్రాహ్మణవాడిలో ఉండే డాక్టర్ ప్రాచీకార్(46) నిమ్స్‌లో అడిషనల్ప్రొఫెసర్గా పనిచేస్తుంది.
ఈమెకు భర్త డాక్టర్ దీపక్, కొడుకు(16) ఉన్నారు. నెల కింద వీరి ఫ్యామిలీ మూసాపేటలో కొన్న ఫ్లాట్‌కు షిప్ట్ అయింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ప్రాచీకార్ఇంట్లో అధిక మొత్తం అనస్థీషియా ఇంజక్షన్తీసుకుంది. స్పృహకోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.