చక్రధర్‌‌గౌడ్ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కస్టడీ పిటిషన్

చక్రధర్‌‌గౌడ్ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కస్టడీ పిటిషన్
  • వంశీకృష్ణసహా ముగ్గురి కస్టడీ కోరిన పోలీసులు

హైదరాబాద్‌, వెలుగు: సిద్దిపేటకు చెందిన రాజకీయ నేత చక్రధర్‌‌ గౌడ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చక్రధర్ గౌడ్‌ను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసిన వంశీకృష్ణ, సంతోష్‌ కుమార్‌‌, బండి పరశురాములును కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ మేరకు వారం రోజులు కస్టడీ కోరుతూ సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనున్నది.  కాగా, వంశీకృష్ణను హరీశ్​రావు పేషీలో నియమించిన సిద్దిపేటకు చెందిన మచ్చ వేణుగోపాల్​కు నోటీసులు జారీ చేశారు. 

 చక్రధర్‌‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి హరీశ్​ రావు కాగా.. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రెండో నిందితుడిగా ఉన్నారు.  గతంలో వంశీకృష్ణ  హరీశ్​రావు పేషీలో పనిచేశాడు.. ఇతను చక్రధర్​కు, అతని అనుచరులకు కాల్స్​ చేసి బెదిరింపుకు పాల్పడేవాడు.