
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఇంస్టాగ్రామ్ సెలెబ్రిటీలతో మొదలైన ఈ కేసుల పరంపర టాలీవుడ్ హీరో హీరోయిన్ల దాకా చేరింది.. హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, ప్రకాష్ రాజ్ వంటి టాలీవుడ్ స్టార్స్ పై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది.. యాంకర్ విష్ణుప్రియను విచారించిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఫోన్ ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనన్న ప్రచారం మొదలైంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ హాజరు కావాలని రెండు రోజుల క్రితం విష్ణుప్రియ సహా యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులిచ్చారు పోలీసులు. ఈ క్రమంలో ఇవాళ ( మార్చి 20 ) అడ్వాకెట్ తో కలిసి విచారణకు హాజరైంది విష్ణుప్రియ.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై సుదీర్ఘంగా విచారించిన అనంతరం విష్ణుప్రియ ఫోన్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసారు పోలీసులు. విష్ణుప్రియకు బెట్టింగ్ యాప్స్ తో ఉన్న లావాదేవీలు, ఫోన్ కాల్స్ వంటి అంశాలపై లోతుగా విచారణ జరిపేందుకు ఫోన్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది..
Also Read:-ఎవడెలా పోతే మనకేంటనుకున్నారు.. వెయ్యి మంది ఉసురు తీసిన..
ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. విచారణకు హాజరవ్వాలని నోటీసులిచ్చిన అనంతరం సమయం కోరిన వారికి టైం ఇస్తామని.. కానీ పూర్తిగా హాజరుకాని వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం కూడా వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు పోలీసులు.