వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిలియర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిలియర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కార్లో (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూయిస్ట్‌‌ పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్వానీ.. ఐబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిలియర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1070–300తో ఇండియాకే చెందిన ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిత్వాలపై గెలిచాడు. రెండున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. ఆరంభంలో సిత్వాల 63 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. కానీ క్రమంగా పుంజుకున్న పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుస బ్రేక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 173, 205 లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లాడు.

ఓ దశలో 400 పాయింట్ల లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. చివరివరకు అదే జోరు కొనసాగించిన పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి వరుసగా బిలియర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తున్న పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈసారి కూడా టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో సెమీస్​లో సౌరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొఠారీ 864–547తో డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాసేర్​ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి పంకజ్‌‌తో టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యాడు.