
దోహా: ఇండియన్ స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీ.. 14వ సారి ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమిర్ సర్కోష్ (ఇరాన్)తో జరిగిన టైటిల్ ఫైట్‌లో ఆరంభంలో వెనుకబడిన పంకజ్ తర్వాత తన సత్తా చూపెట్టాడు. 93, 66 బ్రేక్స్‌తో క్రమంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత ఏ దశలోనూ వెనుదిరిగి చూసుకోలేదు. ఇటీవలే ఇండోర్‌లో జరిగిన నేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లోనూ పంకజ్ టైటిల్ గెలిచాడు.
ఓవరాల్‌గా పంకజ్‌కు ఇది ఐదో ఆసియా స్నూకర్ (15 రెడ్, 6 రెడ్స్, టీమ్ ఫార్మాట్) టైటిల్ కాగా, తొమ్మిది ఆసియా బిలియర్డ్స్ టైటిల్స్‌అతని ఖాతాలో ఉన్నాయి. 2006, 2010 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్స్‌ను కూడా సాధించాడు. తాజా టైటిల్‌తో ఒకే క్యాలెండర్ ఏడాదిలో నేషనల్, ఆసియా, వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షిప్ గెలిచిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. బిలియర్డ్స్‌లో ఇప్పటికే ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. దీంతో రెండు కేటగిరీల్లో ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 14వ ఆసియా టైటిల్ గెలవడం చాలా ప్రత్యేకమైందని, స్నూకర్‌లో ఇది కఠినమైన టోర్నీ అని పంకజ్ వ్యాఖ్యానించాడు.