ప్రపంచ ఛాంపియన్.. పంకజ్

ప్రపంచ ఛాంపియన్.. పంకజ్

నూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ క్యూయిస్‌‌‌‌ పంకజ్ అద్వాణీ 28వ సారి వరల్డ్ టైటిల్‌‌‌‌ నెగ్గి చరిత్ర సృష్టించాడు. ఐబీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బిలియర్డ్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పంకజ్‌‌‌‌ మరోసారి విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో పంకజ్‌‌‌‌ 4–2తో ఇంగ్లండ్‌‌‌‌కు చెందిన రోబర్ట్ హల్‌‌‌‌ను ఓడించాడు. దాంతో వరుసగా ఏడోసారి వరల్డ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. 2016 నుంచి ఈ టోర్నీలో ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌కు ఓటమి అన్నదే లేదు. మధ్యలో 2020, 2021లో కరోనా కారణంగా ఈ ఈవెంట్ జరగలేదు. రాబర్ట్‌‌‌‌తో తాజా ఫైనల్లో పంకజ్‌‌‌‌ ఆరంభం నుంచి అదరగొట్టాడు. ఇండియాకే చెందిన సౌరవ్‌‌ కొఠారీ సంయుక్తంగా కాంస్యం నెగ్గాడు.