WBL వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పంకజ్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌

 WBL వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పంకజ్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా బిలియర్డ్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ పంకజ్‌‌‌‌ అద్వానీ.. డబ్ల్యూబీఎల్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ప్లే బిలియర్డ్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. శనివారం జరిగిన బెస్టాప్‌‌‌‌–15 ఫైనల్లో పంకజ్‌‌‌‌ 7–8తో డేవిడ్‌‌‌‌ కాసియర్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌) చేతిలో ఓడాడు. హోరాహోరీగా సాగిన టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో పంకజ్‌‌‌‌ ఆరంభంలో 2–0 లీడ్‌‌‌‌లో నిలిచాడు. కానీ కాసియర్‌‌‌‌ పట్టువిడవకుండా పోరాడుతూ క్రమంగా పుంజుకున్నాడు. చివరకు డిసైడర్‌‌‌‌లో పంకజ్‌‌‌‌ తక్కువ స్కోరుకే  పరిమితం కావడంతో రెండో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆదివారం నుంచి జరిగే ఐబీఎస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ బిలియర్డ్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పంకజ్‌‌‌‌ డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా బరిలోకి దిగనున్నాడు. 2016 నుంచి ఈ టోర్నీలో పంకజ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలుస్తున్నాడు