పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ X రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నేడు శ్రీలంకతో ఇండియా తొలి వన్డే

పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ X రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నేడు శ్రీలంకతో ఇండియా తొలి వన్డే
  • మ. 2.30 నుంచి సోనీలో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొలంబో: టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన టీమిండియా.. శ్రీలంతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తొలి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా ముగించిన గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు వన్డే ప్లేయర్లపై దృష్టి పెట్టాడు. వన్డేల్లో టీమిండియాకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎవర్ని ఎంపిక చేయాలన్న దానిపైనే కసరత్తు చేయనున్నాడు. 

దీంతో రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. ఒకవేళ ఇద్దరినీ కొనసాగిస్తే శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్కడ ఆడిస్తారో చూడాలి. ఇక షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టనున్నాడు. చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ నేపథ్యంలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ఇద్దరు ఉండటం చాలా అవసరం. గతేడాది వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిన తర్వాత ఇండియా ఆడుతున్న తొలి వన్డే కావడంతో విజయంతో బోణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.