దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు పయనమవ్వడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ నుంచి దాదాపు కొయ్యలగూడెం వరకు అదే పరిస్థితి. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. చాలా మంది సొంతవాహనాల్లోనే వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సాంకేతిక లోపం
మరోవైపు, నల్గొండ జిల్లా, కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కానర్లు పనిచేయకపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. సిబ్బంది మొబైల్స్ స్కానర్లతో స్కాన్ చేస్తూ ట్రాఫిక్‌ని క్లియర్ చేస్తున్నారు. వాహనదారులందరూ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునేలా ఒకే సమయంలో రోడ్లపైకి రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ రద్దీ#Hydrabad #Vijayawada #PanthangiTollGate pic.twitter.com/o1hftS1uY6
— Govardhan Reddy (@SportsNewsInd24) October 13, 2024