మహిళా క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 33 ఏళ్ళ వయసులోనే పాపువా న్యూ గినియా ఆల్ రౌండర్ కైయా అరువా మరణించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం (ఏప్రిల్ 4) ధృవీకరించింది. ఈమె మరణానికి కారణాలు తెలియలేదు. ఈ ఆల్ రౌండర్ 2010లో పాపువా న్యూ గినియా తరపున తూర్పు ఆసియా-పసిఫిక్ ట్రోఫీలో ఆతిథ్య జపాన్‌తో సనోలో అరంగేట్రం చేసింది.
ఆమె 2018 టీ 20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈమె కెప్టెన్సీ చేసింది. ఇదే సంవత్సరంలో ICC ఉమెన్స్ గ్లోబల్ డెవలప్‌మెంట్ స్క్వాడ్‌లో స్థానం పొందింది. 2019 తూర్పు ఆసియా-పసిఫిక్ T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో ఈమెను పర్మినెంట్ కెప్టెన్‌గా ఎంపికైంది. 2019, 2021 ICC మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ లో ఈమె ఆడింది.
ALSO READ :- IPL 2024: RCB అందుకే టైటిల్ గెలవడం లేదు: అంబటి రాయుడు
ఇప్పటివరకు 47 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లాడిన ఈమె బ్యాటింగ్ లో కంటే బౌలింగ్ లో బాగా రాణించింది. 59 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈమె.. 341 పరుగులు చేసింది. తన కెరీర్ లో మూడు సార్లు నాలుగు వికెట్లు.. రెండు సార్లు 5 వికెట్ల ఘనతను అందుకుంది. 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తమ దేశ మహిళా క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది.
Papua New Guinea women's leading wicket taker in T20Is Kaia Arua passes away at age 33 💔
— Female Cricket (@imfemalecricket) April 4, 2024
May her soul rest in peace. 🙏#CricketTwitter pic.twitter.com/rYqoUbXwoG