పాపువా న్యూ గినియాలోని భూకంపం..రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత

పాపువా న్యూ గినియాలోని భూకంపం..రిక్టర్ స్కేలుపై 6  తీవ్రత

పాపువా న్యూ గినియాలోని భూకంపం వచ్చింది.  న్యూ బ్రిటన్ ప్రాంతంలో ఏప్రిల్ 12న రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో ఉందని తెలిపింది.

వారం రోజుల క్రితమే ( ఏప్రిల్ 5న)  న్యూ బ్రిటన్ పాపువ న్యూ గినియా తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. మూడు మీటర్ల వరకు అలలు వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రాంతాలను హెచ్చరించారు.

ఇటీవల మయన్మార్, బ్యాంకాక్ లో వచ్చిన భూకంప ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే..3 వేల మందికి పైగాచనిపోగా..4 వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని ఇంకా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు.