కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ప్రస్తుతం బయటకు వస్తున్న పరిస్థితులు చూస్తుంటే. అనారోగ్యానికి మాత్రలు వేసుకుంటే ఆ టాబ్లెట్లు వల్ల రోగాలు వస్తున్నాయి. దాదాపు మనం వాడే అన్నీ టాబ్లెట్లలో నాణ్యత లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ బుధవారం నివ్వరపోయే విషయాలు వెల్లడించింది. తరుచూ ఉపయోగించే పారాసెటమాల్ కూడా క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యిందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తేల్చి చెప్పింది.
క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయిన టాబ్లెట్స్ ఇవే
కాల్షియం, విటమిన్ D3 సప్లిమెంట్లు, యాంటీ డయాబెటిస్ మాత్రలు, హై బీపీ టాబ్లెట్ తోపాటు మరో 50 కంటే ఎక్కువ గోలీలు భారతదేశంలో డ్రగ్ రెగ్యులేటర్ చేసే క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయని CDSCO(Central Drugs Standards Control Organisation) హెచ్చరించింది. తాజా నెలవారీ మెడిసిన్ అలర్ట్ జాబితాలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) 53 టాబ్లెట్లను నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా (Paracetamol quality test fail) ప్రకటించింది. ఆగస్ట్‌లో CDSCO భారతీయ మార్కెట్‌లో 156 ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లను నిషేధించింది. ఇవి మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఈ మందులలో జ్వర, నొప్పి నివారణ మందులు, అలెర్జీ మాత్రలు ఉన్నాయి.
విటమిన్ సి,డి ,షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డి, పారాసెటమాల్ ఐపి 500 ఎంజి, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హై బ్లడ్ ప్రెజర్ డ్రగ్ టెల్మిసార్టన్ వంటి అత్యధికంగా అమ్ముడుపోతున్న 53 రకాల ఔషదాలు డ్రగ్ రెగ్యులేటర్ టెస్ట్ లో Not of Standard Quality లోకి చేరాయి. ఈ మందులను హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (HAL), కర్ణాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ & క్యూర్ హెల్త్‌కేర్ కంపెనీలు తయారు చేస్తున్నాయి.
స్టమక్ ఇన్ఫెక్షన్ చికిత్స ఉపయోగించే మెట్రోనిడాజోల్ టాబ్లెట్ హిందూస్తాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ తయారు చేస్తోంది. అది కూడా క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, ఉత్తరాఖండ్‌కు చెందిన ప్యూర్ & క్యూర్ హెల్త్‌కేర్ తయారు చేసిన షెల్కాల్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. కోల్‌కతా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఆల్కెమ్ హెల్త్ సైన్స్ ఉత్పత్తి చేసే యాంటీబయాటిక్స్ క్లావమ్ 625, పాన్ డి యాంటీ బయోటిక్స్ నకిలీగా గుర్తించింది. తీవ్రమైన బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్న పిల్లలకు ఇచ్చే హెటెరోస్ సెపోడెమ్ ఎక్స్‌పి 50 డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది.