
ధర్మసాగర్(వేలేరు), వెలుగు: ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వేలేరు మండలం పీచర, వేలేరు గ్రామాల్లో శుక్రవారం కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు వేలేరు ఎస్ఐ హరిత ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ మహేందర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు.