నాకోసం పనిచేసినోళ్లకే దళితబంధు ఇస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

హన్మకొండ జిల్లా పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకోసం పనిచేసే వాళ్ళకే దళిత బంధు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఇంట్లో ఉన్నవాళ్లకు ఎందుకు ఇస్తా.. బీఆర్ఎస్ పార్టీ కోసం, పరకాలలో తన కోసం పనిచేస్తేనే పథకాలు వర్తిస్తాయని వ్యాఖ్యానించారు.

ALSO READ : సూపర్ మార్కెట్లో కరెంట్ షాక్తో నాలుగేళ్ల చిన్నారి మృతి

దామెరలో నిర్వహించిన దళిత బంధు లబ్దిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో  ఈ వ్యాఖ్యలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు.