- బెదిరింపులు, దాడులు వారికి వెన్నతో పెట్టిన విద్య: రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయని పరకాల ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ రావు ఏపీ భవన్ అధికారిపై దాడి చేసిన తీరు, ఓ సీఐని కేటీఆర్ దూషించిన విధానాన్ని ప్రజలందరూ గమనించారన్నారు. బెదిరింపులకు దిగడం, దాడులకు పాల్పడటం బీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించి.. చీర, గాజులు పంపిస్తామని మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, నీ ఇంటికి వస్తానంటూ అరికెపూడి గాంధీని రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు.
హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి సీపీ ఆఫీస్ లో చేసిన రౌడీయిజాన్ని ప్రజలంతా చూశారన్నారు. కౌశిక్ రెడ్డి ఆంధ్రా సెటిలర్ల పై చేసిన వ్యాఖ్యలను హరీశ్, కేటీఆర్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నీతులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
రియల్ ఎస్టేట్‌పై హరీశ్ తప్పుడు ప్రచారం: మేఘారెడ్డి
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోతోందని హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి వీధి గూండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఫైర్ అయ్యారు.
పోలీసులను కూడా బెదిరిస్తున్నారని.. తాటాకు చప్పుళ్లకు పోలీసులు భయపడరన్నారు. ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, వారు చట్టపరంగా వ్యవహ రిస్తున్నారని చెప్పారు.