- టీటీ, రోయింగ్, సైక్లింగ్‌లో నిరాశ
పారిస్ : ఇండియా పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితీష్ కుమార్.. పారాలింపిక్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్–4లో క్వార్టర్ ఫైనల్లో సుహాస్ 26–24, 21–14తో షిన్ కుయాంగ్ వాన్ (కొరియా)పై గెలవగా, ఎస్‌ఎల్3 కేటగిరీలో నితీశ్ 21–5, 21–11తో యాంగ్ జినయువాన్ (చైనా)ను ఓడించాడు. ఇతర గ్రూప్ మ్యాచ్‌ల్లో మానసి జోషి 21–10, 15–21, 21–23తో ఒక్సానా కోజియాన (ఉక్రెయిన్) చేతిలో, మనోజ్ సర్కార్ 19–21, 8–21తో బన్‌సన్ చేతిలో ఓడారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో నితీష్–తులసిమతి , సుహాస్–పాలక్ కూడా ఇంటిదారి పట్టారు. ఆర్చరీలో రాకేశ్ కుమార్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మెన్స్ కాంపౌండ్ ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ 136–131తో అలీవో డ్రామే (సెనెగల్)పై నెగ్గాడు. టేబుల్ టెన్నిస్ డబ్ల్యూడీ 10 క్వార్టర్స్‌లో భావినాబెన్ పటేల్–సోనాల్‌బెన్ పటేల్ 1–3తో యంగ్ జు–సుగాన్ మూన్ (కొరియా) చేతిలో ఓడారు.
రోయింగ్ మిక్స్‌డ్ పీఆర్3 డబుల్ స్కల్స్ హీట్స్‌లో అనిత–నారాయణ ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు. మెన్స్ సైక్లింగ్ సీ2లో అర్షద్ షేక్ 4:20.949 సెకన్లతో తొమ్మిదో ప్లేస్‌లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. టాప్–4 నిలిచిన వాళ్లు మాత్రమే ఫైనల్స్‌కు వెళ్తారు.