ఘనంగా పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు

ఘనంగా పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలను దేశవ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు.  హైదరాబాద్ బేగంపేట చికోటి గార్డెన్స్ లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రంలో భక్తులు ప్రత్యేక ధ్యానం, భజనల్లో పాల్గొన్నారు. 

పరమహంస యోగానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ తదితర పుస్తకాలనుంచి కొన్ని మధుర ఘట్టాలను భక్తులకు చదివి వినిపించారు.  అలాగే  ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు వైఎస్ఎస్ గురుపరంపరలో ఒకరైన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి మహాసమాధి ఆరాధన ఉత్సవాలు ... బేగంపేట ధ్యానకేంద్రంలో జరుగుతాయని వైఎస్ఎస్ కార్యదర్శి శశివదనా రెడ్డి తెలిపారు

ఇది శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన ఒక ప్రాచీన విజ్ఞానం. ఆ తరువాతి కాలంలో అది పతంజలికి, మరికొందరు శిష్యులకూ తెలిసింది. ఈ యుగంలో మహావతార బాబాజీ లాహిరీ మహాశయులకు ఇవ్వగా, ఆయన యోగానందుల గురువైన శ్రీయుక్తేశ్వర్ కు ఉపదేశించారు. 

యోగానంద గురువులు  మహాసమాధి చెంది 73 ఏళ్ళు గడచినా, గృహ అధ్యయనం కోసం రూపొందించిన ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల ద్వారా శ్రద్ధాళువులైన తన శిష్యులకు క్రియాయోగాన్ని నేర్పిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. ఆంతరిక ఆధ్యాత్మిక సహాయాన్ని నిజంగా అన్వేషిస్తూ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా కి వచ్చిన వారందరూ వారు కోరుకునేది భగవంతుడి నుంచి తప్పక పొందుతారని చెప్పారు. .