
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2024 ఐపీఎల్ సీజన్ ఆడటం ఖాయమైపోయింది. నిజానికి 2023 ఐపీఎల్ తర్వాత మాహీ.. ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడని అంతా భావించారు. కానీ ఆ మాటల్లో నిజం లేదని ధోనీ తేల్చేశాడు. అయితే 2024 సీజన్ మాత్రం ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని చాలామంది క్రికెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ధోనీ చిన్ననాటి స్నేహితుడు స్పందించాడు. ఫ్యాన్స్ కు శుభవార్త చెబుతూ ధోనీ మరో సీజన్ ఆడతాడని అన్నాడు.
"2024లో జరగబోయే ఐపీఎల్ సీజన్ తర్వాత కూడా ధోనీ ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తాడు. ఇది అతని చివరి సీజన్ అవుతుందని నేను అనుకోను. అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. మరో ఒకటి లేదా రెండు సీజన్లు ఖచ్చితంగా ఆడతాడని అనుకుంటున్నాను". ఇటీవల వన్‌క్రికెట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరమ్‌జిత్ సింగ్ అన్నారు. రాంచీలో ఇటీవలే ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మహేంద్ర సింగ్ ధోని ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
ధోని ప్రస్తుతం జామ్‌నగర్‌లో తన భార్య సాక్షితో కలిసి అనంత్ అంబానీ,రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదలని ధోని ఇప్పటివరకు 5 టైటిల్స్ అందించాడు. 2023లో గుజరాత్ జయింట్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన సూపర్ కింగ్స్.. 2024 ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్ తో రాయల్ చాలెంజర్స్ తలబడుతుంది.
I Think He is Going to Play One More Season.
— P A V A N (@Pavanmsdian7) March 1, 2024
~ MS Dhoni's friend Paramjit Singh#MSDhoni𓃵 #IPL2024pic.twitter.com/VcaBNpFRBO