పీకేవీవై కింద 637 మంది రైతులు లబ్ధి పొందారు.. ఎంపీ బీకే పార్థసారథి ప్రశ్నకు కేంద్రం రిప్లై

పీకేవీవై కింద 637 మంది రైతులు లబ్ధి పొందారు.. ఎంపీ బీకే పార్థసారథి ప్రశ్నకు కేంద్రం రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) స్కీం  కింద  2019-నుంచి 24 (ఐదేండ్లు)మధ్య తెలంగాణలో 637 మంది రైతులు లబ్ధిపొందినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాం నాథ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే 300 హెక్టార్ల భూమి సేంద్రియంగా మారిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ బీకే పార్థసారథి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

పీకేవీవై స్కీంను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా క్లస్టర్ పద్ధతిలో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో పంట భూమిని సేంద్రీయంగా ధ్రువీకరించడానికి 3 ఏండ్ల పాటు ఒకే ప్రాంతంలో, అదే లబ్ధిదారులచే కార్యకలాపాలు నిరంతరం నిర్వహించబడతాయని వెల్లడించారు.