Parasakthi Controversy: 'పరాశక్తి' వివాదం కొత్త మలుపు.. చివరికి ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?

Parasakthi Controversy: 'పరాశక్తి' వివాదం కొత్త మలుపు.. చివరికి ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?

కోలీవుడ్‌‌‌‌లో గత వారం  రోజుల నుంచి ఇద్దరి హీరోల మధ్య టైటిల్ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు శివకార్తికేయన్ కాగా మరొకరు విజయ్ ఆంటోనీ. ఈ హీరోలిద్దరు పరాశక్తి (Parasakthi) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

అయితే, ఈ రెండు సినిమాలకూ టైటిల్‌‌‌‌ ఒకటి అవడమే కాదు. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమా కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో ఒక్కసారిగా ఈ రెండు సినిమా టీమ్స్ మధ్య టైటిల్ పంచాయితీ ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో తాజాగా పరాశక్తి టైటిల్ వివాదం ముగిసింది. ఈ సందర్భంలో శివకార్తికేయన్‌ సినిమాకి పరాశక్తి టైటిల్‌ను ఇస్తున్నామని AVM ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. శివకార్తికేయన్ సినిమాకు తమిళం, తెలుగు భాషల్లో 'పరాశక్తి' అనే టైటిల్‌ను అలాగే ఉంచాలని మేకర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉండగా, విజయ్ ఆంటోని సినిమాకు తమిళంలో 'శక్తి తిరుమగన్' పేరుతో, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో 'పరాశక్తి' టైటిల్‌ను ఉపయోగించనుందని ప్రకటించారు.

అయితే 73 ఏళ్ల క్రితం తమిళంలో విడుదలైన పరాశక్తి చిత్రం ఇప్పటికీ తమిళ సినీ అభిమానుల ఆదరణ పొందుతోంది. ఈ సినిమాని AVM  సంస్థ నిర్మించింది. ఈ సందర్భంలో శివకార్తికేయన్‌ సినిమాకి పరాశక్తి టైటిల్‌ను ఇస్తున్నామని AVM ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఒక పెద్ద సమస్యను సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసుకున్న నిర్మాతలను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

అసలేం జరిగిందంటే::

శివకార్తికేయన్ పరాశక్తి:

గతేడాది ‘అమరన్‌‌‌‌’తో సూపర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్.. ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. జయం రవి,  అథర్వ,  శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 29న ఈ మూవీ టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 

శివాజీ గణేషన్‌‌‌‌ నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘పరాశక్తి’ టైటిల్‌‌‌‌ను ఈ సినిమాకు పెట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. సెవెంటీస్‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో స్టూడెంట్ పాలిటిక్స్‌‌‌‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌‌‌‌‌‌‌‌ను బట్టి తెలుస్తోంది.  

విజయ్ ఆంటోని పరాశక్తి:

విజయ్ ఆంటోని హీరోగా అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి కూడా ‘పరాశక్తి’ టైటిల్‌‌‌‌ను ఫైనల్ చేశారు. ఈ మూవీ హీరో విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆయన భార్య మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. 

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ చేయించానని విజయ్ ఆంటోని, చెబుతుంటే, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌, తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సి ల్‌లో రిజిస్టర్ చేశామని శివ కార్తికేయన్ మూవీ టీమ్ చెబుతున్నారు.