
వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటారు. సహజంగా బయట ఎగ్ బజ్జీ తినేందుకు జనాలు ఆసక్తి చూపుతారు. మీరు ఎనకా ముందూ చూసుకోకుండా గుడ్డుతో తయారు చేసిన పదార్దాలు లాగించేస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.
ప్రస్తుతం మార్కెట్ లో దొరికే కాయగూరల్లో.. పండ్లల్లో పురుగులు కనపడుతూ ఉంటాయి. వాటిని కట్ చేసేటప్పుడు ఆ భాగాన్ని పక్కన పడేసి మంచిగా ఉన్నదానిని వాడుకుంటాము. ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ లో తొందరగా తయారయ్యే కూరల్లో కోడిగుడ్డు ఒకటి. దీనిని ఉడికించుకొని తింటుంటారు. కాని ఇప్పుడు ఓ జంట ఎగ్ విషయంలో ఓ వింత అనుభవాన్ని చెబుతున్నారు. ఉడికిన కోడిగుడ్డులో బ్యాక్టీరియా ( పురుగులు)ఉన్నాయని చెబుతున్నారు.
కోడిగుడ్డులో పురుగులు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉడకబెట్టిన గుడ్డులో పురుగు ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. దారం షేప్ లో పొడవుగా ఉన్న పురుగు ఉంది. దీనిని తింటే అది మన శరీరంలోకి వెళ్లి గుడ్లు పెడుతుంది. అప్పుడు శరీరం మొత్తం పరాన్నజీవులకు నిలయంగా మారి అనేక వ్యాధులువస్తాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలామంది ఉడకబెట్టిన తరువాత కీటకాలు చనిపోయాయని రాశారు. గుడ్లలో సాధారణంగా సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుందని ఒకరు చెప్పారు. మరొకరు దీనిని థ్రెడ్ అన్నారు. నకిలీ ప్రపంచంలో ఫేక్ ఎగ్స్ దొరుకుతున్నాయని మరొకరు కామెంట్ చేశారు. గుడ్లను ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారంటూ.. ఇది కూడా ఫ్యాక్టరీ ఎగ్ అని.. దాని లోపల థ్రెడ్ వదిలేయాలని కామెంట్లు వస్తున్నాయి.
ఏది ఏమైనా శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవద్దని అనడానికి సైన్స్ పరంగా ముఖ్య కారణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా చాలా త్వరగా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితిలో, మాంసంలో పురుగులు వస్తుంటాయి. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత, దాని తొక్కలు తీసి చూడగా, తెల్లటి రంగు పురుగు కనపడింది. కాబట్టి వర్షాకాలంలో మాంసం, చేపల్లో ఇలాంటి పరాన్నజీవులు కనిపించడం సర్వసాధారణమని చెబుతున్నారు.