కిరాణాల్లోనూ పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ ట్యాబ్లెట్లు... త్వరలో అందుబాటులోకి వచ్చే చాన్స్​

కిరాణాల్లోనూ పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ ట్యాబ్లెట్లు... త్వరలో అందుబాటులోకి వచ్చే చాన్స్​

న్యూఢిల్లీ: లెవోసెట్రిజైన్, ఇబుప్రోఫెన్,  పారాసెటమాల్‌‌తో సహా మొత్తం 27 ప్రిస్క్రిప్షన్- మందులు త్వరలో మెడికల్  జనరల్ స్టోర్లలో ఓవర్ -ది -కౌంటర్ (ఓటీసీ) మందులుగా అమ్మేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని న్యూస్ 18 తెలిపింది. దీని ప్రకారం... 27 మందుల జాబితాలో జెనరిక్ ఫార్ములేషన్‌‌ల పేర్లు,  ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడానికి అనుమతి ఉన్న డోసుల వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఓటీసీ మందుల పంపిణీ, మార్కెటింగ్,  వినియోగాన్ని నియంత్రించడానికి సమగ్ర నిబంధనలు లేవు.  

డ్రగ్ రెగ్యులేటర్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్​సీఓ) డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీట్యాబ్​) సమావేశం సిఫార్సుల మేరకు డ్రగ్స్​ రూల్స్​ మార్చే ప్రపోజల్​ను పరిశీలించడానికి ఒక సబ్​–కమిటీని ఏర్పాటు చేసింది.     తక్కువ డోస్‌లను మాత్రమే జనరల్​ స్టోర్లు అమ్మడానికి అందుబాటులో ఉంచాలని ఇది  స్పష్టం చేసింది. దీనిపై  డీట్యాబ్​ సంప్రదింపులు జరుపుతోంది. త్వరలో ఏర్పాటయ్యే సమావేశంలో దీని గురించి చర్చించనుంది. మరికొన్ని మీటింగ్స్​ తరువాత తుది నిర్ణయం రావొచ్చని అంచనా.