క్షమాభిక్ష పిటిషన్‌‌ రెండేండ్లుగా పెండింగ్

తమిళనాడు గవర్నర్‌‌కు సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రెండేండ్లుగా పెండింగ్ లో ఉంచడంపై తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో తనకు పడిన జీవిత ఖైదు శిక్షను సీబీఐ నేతృత్వంలోని మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ దర్యాప్తు పూర్తయ్యే వరకు నిలిపేయాలని దోషి ఏజీ పెరరివళన్ ఫైల్ చేసిన పిటిషన్ పై సుప్రీం మంగళవారం విచారణ చేపట్టింది. క్షమాభిక్ష పిటిషన్​పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్​ను కోర్టు కోరగలదా? అని జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల డివిజన్ బెంచ్ పిటిషనర్ తరఫు లాయర్ ను ప్రశ్నించింది.

For More News..

‘కౌన్‌‌ బనేగా కరోడ్‌‌పతి’ పై కేసు నమోదు

అలాంటి ప్లేయర్‌ను ఎందుకు వదులుకుంటాం

పెద్ద టీవీలకు ఫుల్ గిరాకీ