
హైదరాబాద్, వెలుగు: పెంపుడు జంతువుల సంరక్షణ కోసం సమగ్ర పరిష్కారాలను అందించే స్టార్టప్ కంపెనీ న్యూట్రిషన్ నెక్స్ట్, 'పేరెంట్' బ్రాండ్‌తో కుక్కల కోసం పెట్ ఫుడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కుక్కల వయసు బట్టి వివిధ రకాల ఫుడ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సందర్భంగా న్యూట్రిషన్ నెక్స్ట్ ఫౌండర్ ప్రహర్ష చెరుకురి మాట్లాడుతూ, "ప్రస్తుతం పెట్ ఫుడ్‌ను థాయిలాండ్‌లోని మా భాగస్వాముల వద్ద తయారు చేస్తున్నాం.
తెలంగాణలోని వర్గల్ (సిద్ధిపేట) వద్ద ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా స్వంత తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాం. 2025–26 నాటికి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 కోట్లు) పెట్టుబడితో ఏడాదికి 40,000 టన్నుల పెట్ ఫుడ్‌ను తయారు చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం" అని అన్నారు.