పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత మార్చి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దాంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు విద్యార్థులకు గత కొన్ని నెలల నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఇంటర్‌నెట్, స్మార్ట్ ఫోన్ తదితర సమస్యల విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసులకు అంతరాయం ఏర్పడుతుంది.

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 9,10, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నిరకాల టెక్నికల్ స్టడీస్‌కి సంబంధించిన స్కూల్స్, కాలేజీలు ఫిబ్రవరి 1న ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. అయితే పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం తొమ్మిది మందితో కూడిన కమిటీని నియమించింది. వీరంతా స్కూల్స్ ప్రారంభానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. అంతేకాకుండా.. విద్యాసంస్థల ప్రారంభానికి తెలంగాణ విద్యాశాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ నెల 18న ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇవ్వనుంది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన స్పెషల్ కేర్‌పై కూడా ఓ నిర్ణయం తీసుకోనుంది.

కమిటీ సూచన మేరకు విద్యాశాఖ ఈ కింది సూచనలు చేసింది

ఈ నెల 20లోగా ప్రతి స్కూలు, కాలేజీని శుభ్రపరిచి శానిటేషన్ చేయాలి

స్కూళ్లు, కళాశాలలు ప్రతి నిత్యం శానిటేషన్ చేయాలి. టాయిలెట్లు, వాటర్ ట్యాంక్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాంతాలు కచ్చితంగా శానిటేషన్ చేయాలి.

స్కూళ్లు, కాలేజీలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ఫర్నిచర్ సామాగ్రిని, స్టేషనరీ, స్టోరేజ్ ప్రాంతాలను, కిచెన్‌లను, ల్యాబ్‌లను శుభ్రపరచాలి.

వైద్య శాఖ సూచించిన మేరకు ప్రతి విద్యార్థి ఆరు ఫీట్ల దూరం కూర్చునే విధంగా సీట్లకు మార్కింగ్ చేయాలి.

కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందని పేరెంట్స్‌కు చెప్పి.. వారి నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకున్న విద్యార్థులను మాత్రమే ఫిజికల్ క్లాసులకు అనుమతించాలి.

డిజిటల్ క్లాసులు, సోషల్ మీడియా టీచింగ్ కొనసాగుతుంది.

పరీక్షలు రాసే వారికి హాజరు శాతం కచ్చితంగా ఉండాలని నిబంధన పెట్టకూడదు.

కాలేజీలు, స్కూళ్లలో రెండు ఐసోలేషన్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి.

ప్రతి తరగతి గదిలో శానిటైజర్‌ను తప్పనిసరిగా పెట్టాలి.

ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద ఫిజికల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలి.

లాజిస్టిక్ ప్లాన్, సీటింగ్ ప్లాన్, మెడికల్ ప్లాన్, శానిటేషన్ ప్లాన్ ఖచ్చితంగా ఈ నెల 18లోగా సంబంధిత అధికారికి సమర్పించాలి.

పాఠశాలలో, కాలేజీలో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు.

ఇంతకు ముందున్న స్కూలు టైమింగ్సే పాటించాలి.

విద్యార్థులు, స్కూల్, కాలేజీ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

విద్యార్థులకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఉంటే అనుమతించకూడదు.

మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంచాలి.

క్లాసు రూములో ఆరు ఫీట్ల దూరం పాటిస్తూ.. క్లాస్ రూమ్‌కు 20 మంది చొప్పున మాత్రమే ఉంచాలి.

For More News..

నీట్ పీజీ 2021 షెడ్యూల్ విడుదల

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. తొమ్మిది జిల్లాలో వ్యాప్తి

ఇండోనేషియాలో భారీ భూకంపం

మొదలైన నాలుగో టెస్ట్.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్