
ఇంట్లో పెద్దల్ని బట్టే పిల్లలుంటారు. మాటతీరు, ఆలోచనల్నేపిల్లలూ అనుకరిస్తారు. కానీ, కొందరు పేరేంట్స్ ఇవేం పట్టించుకోకుండా పిల్లల ముందు ఏవేవో మాట్లాడతారు. ఇతరుల చర్మం రంగు, రూపం గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు.కానీ పిల్లల ముందు అలాంటి మాటలు అస్సలు మంచివి కావు.పసివయసులోనే ఆ మాటలు చెవిన పడితే వాళ్లు కూడా మనిషి రూపాన్ని బట్టి వాళ్లతో బంధాలని ఏర్పరుచుకుంటారు. కాస్త చామనఛాయగా ఉన్నవాళ్లని తక్కువ చేసి చూస్తుంటారు.
అందుకే పిల్లల ముందు రంగు, రూపం గురించి మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్లకి అలాంటి భావాలున్నా వాటిని దూరం చేయాలి. మనిషికి రంగు, రూపం ముఖ్యం కాదు... ప్రవర్తన బట్టి స్నేహం చేయాలని చెప్పాలి. అంతేకాదు రూపం కారణంగానే ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని చెప్పాలి.
అలాగే పిల్లల ముందు ఇంట్లో పనివాళ్లని, సబార్డినేటర్లను చులకన చేసి మాట్లాడకూడదు. అలాచేస్తే వాళ్లకి కూడా వాళ్ల పట్ల చులకన భావమే కలుగుతుంది.