
మియాపూర్, వెలుగు: స్కూల్ బిల్డింగ్ఆరో అంతస్తు నుంచి దూకిన బాలుడికి బ్రెయిన్ డెడ్అయింది. దీంతో తల్లిదండ్రులు బాలుడి అవయవాలు డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీలో ఉండే జె.రవి కుమార్, వాసంతి దంపతులకు కొడుకు రాజనాగ వెంకట హరిశ్చంద్ర ప్రసాద్(14), ఓ కూతురు ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ స్థానిక క్వాంటమ్ లీఫ్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు.
ఈనెల 3న సాయంత్రం 3.30 గంటలకు స్కూల్అయిపోయాక స్కూల్బిల్డింగ్ఆరో అంతస్తు నుంచి దూకాడు. ఫస్ట్‌ఫ్లోర్‌లోని రేకులపై పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని టీచర్లు మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. కుడి కాలు, చేయి విరిగి ఆసుపత్రిలో కోమాలోకి వెళ్లాడు. బుధవారం ఉదయం 9.55 గంటలకు బాలుడి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. రవికుమార్, వాసంతి దంపతులతో డాక్టర్లు మాట్లాడడంతో బాలుడి అవయవాలు డొనేట్చేసేందుకు ముందుకు వచ్చారు. నాలుగు అవయవాలను డొనేట్ చేశారు.