- రేపటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్..
- ప్రైవేట్ స్కూళ్లు 20 నుంచి 30 శాతం పెంచి ఫీజుల వసూలు
- యూనిఫామ్, బుక్స్ కు అదనం
- బెంబేలెత్తుతున్న పేరెంట్స్
- స్కూలు ఫీజులకు అప్పులు
- ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తల్లిదండ్రుల డిమాండ్
హిమాయత్‌నగర్‌లో ఉండే రాజ్‌కుమార్ ప్రైవేట్ ఎంప్లాయ్. అతనికి ఇద్దరు పిల్లలు. ఓ ప్రైవేట్ స్కూల్ లో కూతురు 8 వ క్లాస్. కొడుకు 5వ క్లాస్ చదువుతుండగా.. ఇద్దరికి ఏడాదికి రూ. లక్ష ఫీజు కడుతుండగా.. ఇటీవలే ముందస్తుగా 50 వేలు చెల్లించాడు. యూనిఫామ్, బుక్స్, షూస్ ఇతరాలు అంటూ ఇద్దరికీ మరో రూ. 25 వేలు, ట్రాన్స్‌పోర్టుకు 45 వేలు కట్టాడు. చాలి చాలని జీతంలో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతడు ఆర్థికంగా అప్పుల పాలయ్యాడు.
ఇంట్లోని గోల్డ్ కుదువ పెట్టి స్కూల్ ఫీజుకు, మిగతా డబ్బు మరో 3 నెలల్లో చెల్లించాలని అతడు వాపోయాడు. ఇది ఒక్క రాజ్‌కుమార్ పరిస్థితి మాత్రమే కాదు. సిటీలోని ఎందరో పేరెంట్స్ పెరిగిన స్కూల్ ఫీజులు, యూనిఫామ్స్, బుక్స్ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఉంది.
హైదరాబాద్, వెలుగు: జూన్ నెల వచ్చిందంటే చాలు.. పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతారు. అకాడమిక్ ఇయర్ ఇదే నెలతోనే మొదలవుతుండగా.. స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి. దీంతో స్కూళ్లకు పిల్లలను పంపాలంటేనే పేరెంట్స్ జంకుతుంటారు. కొన్నేండ్లుగా పేరెంట్స్ ను ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఇష్టారీతిన పెరిగిపోతుండగా.. ఫీజులు, యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్ అంటూ.. లక్షల్లో ఖర్చు అవుతుండటంతో , పేద, మధ్య తరగతి పేరెంట్స్అప్పులు తెచ్చి మరీ కడుతున్న పరిస్థితి ఉంది.
ఇద్దరు పిల్లలు ఉన్న పేరెంట్స్ పరిస్థితి మరి దారుణంగా మారింది. ఒక్కొక్కరిపై కనీసం రూ. లక్ష దాకా ఖర్చు చేయాల్సివస్తుంది. ప్రైవేట్విద్యపై మోజు, సొసైటీలో ప్రెస్టేజ్ కోసం.. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే కోరికతో పేరెంట్స్అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. కొందరు అప్పులు చేస్తుంటే ఇంకొందరు ఇంట్లోని బంగారాన్ని కుదువ పెట్టి, లేదంటే బంగారాన్ని అమ్మి ఫీజులు కడుతున్నారు.
ఇష్టారీతిన పెంచేస్తున్న ఫీజులు..
రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. కొన్ని స్కూళ్లు 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచేశాయి. నిర్వహణకు ప్రతి ఏడాది పది శాతం మాత్రమే ఫీజులు పెంచాలని రూల్ ఉంది. అయినా.. ఫీజుల పెంపుపై నియంత్రణ లేకపోవడతో ప్రైవేట్ మేనేజ్ మెంట్లు ఆడిందే ఆటగా ఉంది. అధిక ధరలకు స్కూల్యూనిఫామ్స్, బుక్స్, షూస్ అమ్మకూడదని అధికారులు హెచ్చరించినా బేఖాతరు చేస్తున్నాయి. ప్రైవేట్స్కూళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణకు సరైన చట్టాలు లేకపోడంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయి. స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేకపోయినా.. ఫీజుల్లో మాత్రం రాజీ పడట్లేదు. ప్రైవేట్‌స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చట్టం తీసుకురావాలని పేరెంట్స్డిమాండ్చేస్తున్నారు.
అప్పు చేసిన..
చిన్న బిజినెస్ చేసుకుంటున్న. నాకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి ఓ ప్రైవేట్‌స్కూల్ లో థర్డ్ క్లాస్. ఫీజు 40 వేలు, బుక్స్, యూనిఫామ్స్, షూస్, వైట్ యూనిఫామ్ కు మరో10 వేలు చెల్లించాను. ఇప్పుడు చిన్న అమ్మాయికి కూడా స్కూల్ఫీజు చెల్లించడానికి చేతిలో రూపాయి లేదు. ఇంట్రెస్ట్ కు తీసుకొచ్చిన.
మహేందర్, ఉప్పల్
చట్టం తెస్తేనే సిస్టం మారుద్ది
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై ప్రభుత్వం చట్టం తీసుకొస్తేనే నియంత్రణలో ఉంటాయి. ఇక యూనిఫామ్స్, బుక్స్అధిక ధరలకు అమ్మకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని నియమించి, సాధ్యమైనంత తొందరగా
జీవో తీసుకురావాలి.
వెంకట్ సాయిరామ్, హైదరాబాద్స్టూడెంట్స్ పేరెంట్స్‌అసోసియేషన్