- ఆర్సీవోను నిలదీసిన పేరెంట్స్
సూర్యాపేట, వెలుగు: పిల్లల సమస్యలపై ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని, వాళ్లు చనిపోయాక మీటింగ్‌లు పెట్టి ఏం లాభమని ఇమాంపేట గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్సీవోను నిలదీశారు. విద్యార్థినుల ఆత్మహత్యల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన మానసిక నిపుణుల కమిటీ మెంబర్లు సోమవారం ఇమాంపేట ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్సీవో అరుణకుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు బతికున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కమిటీ మెంబర్లు వాళ్లకు సర్ది చెప్పి.. స్టూడెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అయ్యి సమస్యలపై ఆరా తీసి పరిష్కార మార్గాలు చూపారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పద్మ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్రియాట్రీ డాక్టర్ అనిల్, సైక్రియాలజిస్ట్ డాక్టర్ సరస్వతి, స్టూడెంట్ కౌన్సిలింగ్ ఓఎస్డీ ఉమా మహేశ్వరి, ఆర్సీవో అరుణ కుమారి, ప్రిన్సిపాల్ ప్రేమ లత పాల్గొన్నారు.