ఫ్యాకల్టీ లేకుండా కాలేజీ ఎలా నడిపార్రా నాయనా..ఫిట్జీ కాలేజీ ముందు పేరెంట్స్ ఆందోళన

ఫ్యాకల్టీ లేకుండా కాలేజీ ఎలా నడిపార్రా నాయనా..ఫిట్జీ కాలేజీ ముందు పేరెంట్స్ ఆందోళన
  • ఫ్యాకల్టీ లేకుండా ఇంటర్ క్లాసులు..ఫిట్జీ కాలేజీ నిర్వాకం..పేరెంట్స్ ఆందోళన 
  • ఫిట్జీ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

బషీర్​బాగ్, వెలుగు: సైఫాబాద్ లోని ఫిట్జీ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆందోళనకు దిగారు. ఫ్యాకల్టీ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇంటర్ చదువుతున్న తమ పిల్లలు భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. ఇంటర్ ఫస్టియర్​లో ఫ్యాకల్టీ లేకపోవడంతో బయట ట్యూషన్ లకు పంపించి, ఎగ్జామ్స్ రాయించామని బాధిత తండ్రి జలందర్ రెడ్డి తెలిపారు. 

సెకండియర్ కూడా అదే పరిస్థితి ఉందని, తమతో రెండేళ్లకు గాను రూ.5 నుంచి 10 లక్షల వరకు ఫీజులు కట్టించుకున్నారని వాపోయారు. ఇంటర్ తో పాటు జేఈఈ , ఇయర్ లాంగ్ టర్మ్ జేఈఈ లకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. తమ పిల్లలను వేరే కాలేజీలలో చేరుస్తున్నామని, తాము కట్టిన ఫీజులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. 

సుమారు వెయ్యి మంది విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యం ఫీజులు వసూలు చేసిందని, వారిపై పోలీసులకు , ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు. అయితే, కాలేజీకి సంబంధించి అకౌంట్స్ ను సుప్రీం కోర్టు ఫ్రీజ్ చేసిందని, త్వరలోనే విద్యార్థులు కట్టిన ఫీజులను తిరిగి చెల్లిస్తామని ఫిట్జీ సిబ్బంది తెలిపారు.