![పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి](https://static.v6velugu.com/uploads/2025/02/parents-participate-in-sports-and-cultural-events-at-paradise-high-school-in-karimnagar_XGyMuO3CFH.jpg)
కొత్తపల్లి, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, పారడైజ్, సెయింట్ జార్జ్ స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి పారడైజ్ స్కూల్లో పేరెంట్స్కు శనివారం పలు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ సీఈవో ఉమాకాంత్, ప్రిన్సిపల్ టి.వసంత, వైస్ ప్రిన్సిపల్ ఎ.మధు, ప్రీతిరావు, ప్రియాంకరావు తదితరులు పాల్గొన్నారు.