Hyderabad: ఆ స్కూల్ అధిక ఫీజుల వసూళ్లపై రోడ్డిక్కిన తల్లిదండ్రులు.. హయత్ నగర్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..

Hyderabad: ఆ స్కూల్ అధిక ఫీజుల వసూళ్లపై రోడ్డిక్కిన తల్లిదండ్రులు.. హయత్ నగర్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ లో జీ హైస్కూల్ ఆగడాలకు నిరసనగా తల్లిదండ్రులు రోడ్డెక్కారు.  ఫీజులు అధికంగా పెంచీ విద్యార్థులను టార్చర్ చేస్తోందని, ఫీజులు చెల్లించకపోతే క్లాస్ లోకి ఎంట్రీ లేదని బెదిరిస్తున్నారని నిరసనకు దిగారు. హయత్ నగర్ లో జీ హై స్కూల్ యాజమాన్యం తీరుపై  భారీ ఎత్తున ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టారు తల్లిదండ్రులు. 

స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారీ ఎత్తున ఫ్లకార్డులతో విజయవాడ హైవేపై ర్యాలీ చేపట్టారు. అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ చేపట్టడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ALSO READ : 31వ తేదీ తర్వాత ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టరు.. : కేంద్రం సంచలన నిర్ణయం

స్కూల్ యాజమాన్యం ఒకేసారిగా 30% నుంచి 50% వరకు ఫీజులు పెంచారని నిరసనకు దిగారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఫీజులు చెల్లించాల్సిందేనని, లేదంటే క్లాస్ రూమ్ లోకి వెళ్లనిచ్చేంది లేదని ముక్కు పిండి వసూలు చేస్తున్నారి ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.