డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి : ఏసీపీ శ్రీనివాస్ రావు

డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి : ఏసీపీ శ్రీనివాస్ రావు

ఆటో, క్యాబ్ డ్రైవర్లు వృత్తి పరంగా బిజీగా ఉండటమే కాదు తమ పిల్లలని గమనిస్తూ ఉండాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రావు సూచించారు. మీరు,  మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకూడా ఉండాలని కోరారు.  డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించి, వారి భవిష్యత్ ని చక్కదిదాలని తెలిపారు.  అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భాగా ఆయన మాట్లాడారు.  డ్రగ్స్ గురించి ప్రజలు అవగాహన చెంది యువత డ్రగ్స్ బారిన పడకుండా మీరు తోడ్పాటును ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ ని నిర్మూలించి బావి తరాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.