నల్గొండ అర్బన్, వెలుగు : స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న హెచ్ఎం, ఎస్జీటీని పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులోని డైట్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్ల్ లో సోమవారం వెలుగు చూసింది. స్కూల్ హెచ్ ఎం పోలె వెంకటయ్య, ఎస్జీటీ శ్యాంసుందర్ కొద్ది రోజులగా 4, 5వ తరగతి స్టూడెంట్లతో లంచ్, స్టడీ అవర్ టైంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ విషయాన్ని పిల్లలు ఓ లేడీ టీచర్ కు చెప్పడంతో ఆమె పేరెంట్స్ కు చెప్పాలని సూచించింది. దీంతో స్టూడెంట్లు పేరెంట్స్ కు విషయం చెప్పగా వారు స్కూల్ కు వచ్చి హెచ్ ఎం, టీచర్ ను చెప్పులతో చితకబాది నల్గొండ టూటౌన్ పోలీసులకు అప్పగించారు.
విషయం తెలుసుకున్న నల్గొండ ఎంఈవో అరుంధతి, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ నర్సింహతో, విద్యాశాఖ జిల్లా సూపరింటెండెంట్, ఏడీలు బ్రహ్మచారి, శంకర్స్కూల్ కు వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు. అనంతరం రిపోర్టును డీఈవో బొల్లారం భిక్షపతి, కలెక్టర్ హరిచందనకు అందజేశారు.