
తూప్రాన్ , వెలుగు: కిష్టాపూర్ స్కూళ్లో కేవలం ముగ్గురే టీచర్లు ఉండడంతో తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేశారు. తూప్రాన్ మండలం కిష్టాపూర్ యూపీఎస్ స్కూల్ లో 1నుంచి7 తరగతులు ఉన్నాయి. 103 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో అన్ని లెస్సన్స్ చెప్పలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి టీచర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.