ఇవాళ్టి నుంచి అథ్లెటిక్స్​ పోటీలు

ఇవాళ్టి నుంచి అథ్లెటిక్స్​ పోటీలు

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అందరూ ఆసక్తిగా ఎదురుచూసే అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలకు గురువారం తెరలేవనుంది. ఇండియా నుంచి 29 మంది బరిలోకి దిగుతున్నారు. ఇందులో జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోప్రాపై భారీ అంచనాలున్నాయి. మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు గాయంతో ఒకటి, రెండు టోర్నీలకు దూరంగా ఉన్నా పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై మళ్లీ పోడియం ఫినిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాడని భావిస్తున్నారు. ఈ నెల 8న జరిగే జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకుని కొత్త చరిత్ర సృష్టించాలని నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. దోహా డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన అతను గాయంతో పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్నాడు. ఇక పావో నురుమి గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గడంతో మళ్లీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. 

జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెనా కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 కి. మీ రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వికాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియాంక గోస్వామిపై ఆశలున్నాయి. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 వేల మీటర్ల స్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవినాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాబ్లే, మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4x400 రిలే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉంది. జ్యోతి ఎర్రాజీ (విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 మీ. హార్డిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), తేజిందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పారుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరి, అన్ను రాణి కూడా పతకంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా రెపిఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చారు. హీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచిన వాళ్లు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తారు. మిగతా వారు రెపిఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకోవచ్చు.