
కొత్త ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశానన్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడనని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి రెండు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహించినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో చోటు రావొచ్చని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన రామ్మెహన్ రెడ్డి మొదటి సారి జిల్లా పార్టీ ఆఫీస్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కేబినెట్ లో ఇప్పటికే 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ నుంచి పలువురు రేసులో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి నలుగురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు.
వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్, తాండూరు నుంచి మనోహర్ రెడ్డి, పరిగి నుంచి రామ్మెహన్ రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి గెలిచారు. వికారాబాద్ నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక రేసులో మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.