పరిగి , వెలుగు : ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో విడుదల చేసిన నిధులు, బీఆర్ఎస్ పదేండ్లు విడుదల చేసిన నిధులు ఎంతో చర్చిద్దాం..శివారెడ్డిపల్లికి ఎప్పుడు వస్తావో రా’ అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కేటీ ఆర్కు సవాల్ విసిరారు. ఆదివారం పరి గిలోని ఆయన ఇంట్లో మాట్లాడుతూ కులకచర్ల మండలం మండలం దాస్య నాయక్ తండాకు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం కేటీఆర్ వచ్చి రేవంత్ రెడ్డిపై, ప్రజాపాలనపై అబద్దపు ఆరోపణలు చేశాడన్నారు.
శివారెడ్డి పల్లికి వచ్చి కేటీఆర్ మాట్లాడతానన్నారని, తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. లిక్కర్ కేసులో కేటీఆర్ సోదరి కవిత, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హరీశ్ రావు, కేసీఆర్ ఆర్థికనేరాలకు పాల్పడ్డారని, వీటిపై విచారణ జరుగుతోందన్నారు. కవిత..తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ, కేరళ లిక్కర్ కేసుల్లో దిగజార్చారన్నారు. ఈ అన్ని విషయాలపై శివారెడ్డి పల్లికి వస్తే చర్చించడానికి తాను రెడీగా ఉన్నట్టు చెప్పారు.