దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేసి పోటీ చెయ్‌‌ : రాంమోహన్ రెడ్డి

దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేసి పోటీ చెయ్‌‌ : రాంమోహన్ రెడ్డి
  • కేటీఆర్‌‌‌‌కు పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి సవాల్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ సవాల్ చేయడం కాదని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కొడంగల్‌‌లో జడ్పీటీసీగా లేదా ఎంపీపీగా గెలవాలని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి సవాల్‌‌ విసిరారు. కొడంగల్‌‌లో ఎమ్మెల్యేగా పోటీకి తమ నాయకుడు అక్కరలేదని, తాను పోటీకి సిద్ధమన్నారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌‌‌‌కు దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్లలో రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్‌‌ చేశారు. 

జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే కేటీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయనపై ఇప్పటికే ఏసీబీ, ఈడీ విచారణ జరుగుతున్నదని, ఆయన చెల్లి కవిత తీహార్ జైలుకెళ్లి వచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ నుంచి కొడంగల్‌‌కు మనుషులను తీసుకొచ్చి కేటీఆర్ షో చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్​పై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌‌‌‌కు లేదన్నారు.