ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల రుణమాఫీ నిధులు : ఎమ్మెల్యేరామ్మోహన్​ రెడ్డి

ఒక్కో నియోజకవర్గానికి  రూ.200 కోట్ల రుణమాఫీ నిధులు : ఎమ్మెల్యేరామ్మోహన్​ రెడ్డి
  • పరిగి ఎమ్మెల్యేరామ్మోహన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఆరేడు నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేసిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రైతు భరోసాపై ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం రుణమాఫీ చేస్తే వడ్డీలకే సరిపోయాయని, రైతుల ఖాతాలు ఎన్​పీఏలోకి వెళ్లాయని తెలిపారు. తెలంగాణ భూభారతి చట్టం తీసుకువచ్చి సీఎం రేవంత్​ రెడ్డి ధరణి కష్టాలను తీరుస్తున్నారని చెప్పారు. 

ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. లగచర్ల ఇష్యూలోనూ బీఆర్ఎస్  నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్​ మీడియా టీంను అడ్డం పెట్టుకుని ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. సురేష్​  అనే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఇక వికారాబాద్  ప్రాంతానికి రూ.15 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి  30 వేల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్  రెడ్డి ప్రయత్నిస్తుంటే, అడ్డుకుంటున్నారన్నారు.