
వికారాబాద్ జిల్లా దోమ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిత్యం దోమ ప్రభుత్వ ఆసుపత్రి పై ఫిర్యాదులు రావడంతో నేరుగా ఎమ్మెల్యే వెళ్లి చూడగా ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం చేయడానికి సిబ్బంది లేకపోవడంపై డిఎంహెచ్ఓ కి ఫోన్ చేసి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేసిందని.. పేద ప్రజలకు సరైన వైద్యం అందాలని ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.